యూజర్లకు శుభవార్త... శామ్‌సంగ్ పీసీలకు స్లైడబుల్ డిస్‌ప్లేలు, వివరాలివే!   

మడతబెట్టే ఫోన్లు వస్తాయని టెక్ కంపెనీలు ప్రకటిస్తే.అదంతా వట్టి బూటకమే అని అప్పుడు అందరూ అనుకున్నారు.

 Good News For Users Sliding Displays For Samsung Pcs , Details, Samsung Pc, Slid-TeluguStop.com

కానీ శామ్‌సంగ్‌ లాంటి కంపెనీలు దానిని నిజం చేశాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు స్లైడబుల్ పీసీ డిస్‌ప్లేలను తీసుకొస్తున్నట్లు శామ్‌సంగ్‌ తాజాగా ప్రకటించింది.2022 ఇంటెల్ ఇన్నోవేషన్ కీనోట్ ఈవెంట్‌లో శామ్‌సంగ్‌ సంస్థ తన పీసీల కోసం ’17-అంగుళాల స్లైడబుల్ డిస్‌ప్లే’ని తీసుకొస్తున్నట్లు తెలిపింది.అంతేకాదు ఈ డిస్‌ప్లే ఎలా పనిచేస్తుందో ఒక ప్రోటోటైప్‌ ద్వారా చూపించింది.

ఈ ప్రదర్శనలో శామ్‌సంగ్‌ డిస్‌ప్లే CEO JS చోయ్ 17-అంగుళాల డిస్‌ప్లేను అడ్డంగా అటూ ఇటూ స్లైడ్‌ చేస్తూ చూపించి మంత్రం ముగ్ధుల్ని చేశారు.

JS చోయ్ ఆన్-స్టేజ్ డెమో ద్వారా చూపించిన పీసీ స్లైడబుల్ స్క్రీన్ సూపర్‌గా వర్క్ అయ్యింది.

ఈ డిస్‌ప్లేను త్వరలో ప్రజలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది.OLED డిస్‌ప్లేతో వచ్చే ఈ పీసీల కమర్షియల్ ప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇంటెల్ ఈవెంట్‌లో దీనిని ప్రదర్శించారు కాబట్టి ఇది కొత్త యునిసన్ సాఫ్ట్‌వేర్‌తో రన్‌ అవచ్చు.నిజానికి ట్యాబ్లెట్ లాగా కనిపించే ఈ పీసీ డిస్‌ప్లే 13-అంగుళాల పొడవుంది.

దీనిని అడ్డంగా 17 అంగుళాలకు పొడిగించేలా ఫ్లైట్ డిస్‌ప్లే అందించారు.ఈ వర్కింగ్ ప్రోటోటైప్‌పై ఒకే స్టాటిక్ ఇమేజ్ అనిపించింది.

JS చోయ్ చెప్పిన దాని ప్రకారం, ఇది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 3 వంటి ట్యాబ్లెట్ లాంటి ఫారమ్ ఫ్యాక్టర్‌తో ప్రత్యేకంగా తయారు చేశారు.కాగా దీని డిస్‌ప్లే ప్యానెల్ రిజల్యూషన్, యాస్పెక్ట్ రేషియో, బ్రైట్‌నెస్, ఇతర స్పెసిఫికేషన్లు ఇంకా తెలియ రాలేదు కాబట్టి ఇది ఎంత కాలం మన్నికగా ఉంటుందో నిర్ధారించడం కష్టం.స్లైడబుల్ డిస్‌ప్లే క్వాలిటీ తెలియకపోయినా డిజైన్ అదిరిపోయిందని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ట్యాబ్లెట్-ఎస్క్యూ డిజైన్‌లను దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్‌ల కోసం ఈ స్లైడబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు చోయ్ తెలిపారు.

ఈ టెక్నాలజీని శామ్‌సంగ్‌, ఇంటెల్ వంటి కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube