స్టార్ హీరోస్ సినీ జర్నీ లో కొన్ని సినిమాలు ప్రత్యేకం.ఇక యంగ్ టైగెర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ , బ్లాక్ బస్టర్ అయినా సినిమాలు ,అలానే డిఫెరెంట్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి .
సినీ ఇండస్ట్రీ లో యంగ్ టైగెర్ ఎన్టీఆర్ కు డైరెక్టర్ వి.వి వినాయక్ అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది .ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆది సినిమా బాక్సా ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.
ఇక అసలు విషయానికి వస్తే .ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో రీ -రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది .ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ అయిన ఖుషి సినిమా ,అలానే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా కూడా 4k వెర్షన్ లో రీ రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా అలరాయించాయి.ఇక స్టార్ హీరోస్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా మల్లి రీ -రిలీజ్ అయితే మల్లి థియేటర్స్ లో చూడాలి అని కోరుకుంటారు.
ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళితే .యంగ్ టైగెర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో అదుర్స్ సినిమా చాలా ప్రత్యేకం .ఎన్టీఆర్ -వివి వినాయక్ కాంబినేషన్ కు అభిమానులు చాలా మంది ఉన్నారు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది.ఇక ఆ తరువాత మల్లి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సాంబ , ఈ మూవీ లో ని సాంగ్స్ ,సెంటిమెంట్ సీన్స్ ,ఎన్టీఆర్ యాక్టింగ్ ,వినాయక్ టేకింగ్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయింది .సాంబ సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని డైరెక్టర్ వినాయక్ -ఎన్టీఆర్ తో హ్యటిక్ గా అదుర్స్ సినిమా తెరకెక్కించారు .అప్పటి వరకు తారక్ ను సీరియస్ రోల్స్ లో చుసిన అభిమానులు అదుర్స్ సినిమాలో డ్యూయల్ రోల్ లో కామెడీ యాంగిల్ లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు.ఎన్టీఆర్ సినీ కెరీర్ లో అదుర్స్ సినిమా గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే .అదుర్స్ సినిమా ట్రైలర్స్ ,టీజర్స్ , సాంగ్స్ ,ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ , నయనతార గ్లామర్ , బ్రహ్మానందం కామెడీ సీన్స్ , డైరెక్టర్ వినాయక్ టేకింగ్ , కోనవెంకట్ డైలాగ్స్ ,ఇలా అని అంశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది .ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి కూడా అదుర్స్ సినిమా లోని కామెడీ సీన్స్ చాలా ఇష్టం అని పలు సందర్భాల్లో తెలియజేసారు .ఇక టెంపర్ సినిమా రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న డైరెక్టర్ వినాయక్ ను ఈ సినిమా సీక్వెల్ గురుంచి అభిమానులు అడగ్గా త్వరలో ఉంటుంది అని సమాధానమిచ్చారు .

ఇక ఇంతటి బ్లక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిన అదుర్స్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అదుర్స్ సినిమా 13 ఏళ్ల తర్వాత మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమా ని మార్చి 4వ తేదీన రి రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది .గతంలో మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ తో పాటు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాగా అలరించాయి.

ఎన్టీఆర్ అభిమానులలో అదుర్స్ సినిమా మల్లి రీ రిలీజ్ అవుతుందన్న విషయం తెలియడంతో అభిమానులు సంతోషంతో ఉన్నారు .ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ,ముఖ్యంగా ఎన్టీఆర్ చారీ పాత్రలో – బ్రహ్మానందం తో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బలే హిలేరియస్ గా నవ్వించాయి .అప్పటివరకు సీరియస్ రూల్స్ లోనే నటించిన ఎన్టీఆర్ మొదటిసారి కామెడీ టైమింగ్ లో కూడా అదుర్స్ అనిపించేలా చేశారు.ఇక ఫైనల్ గా అదుర్స్ సినిమా మల్లి రీ -రిలీజ్ అవ్వడంతో తారక్ అభిమానులు సంతోషంతో ఉన్నారు .అలాగే అదుర్స్ సినిమాకు సీక్యూల్ చూడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు .







