ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్...!

తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్తని తెలిపాయి.అదేమిటంటే.

గత రెండు నెలల కాలం నుండి వంటగ్యాస్ భారం ప్రజలపై పడకుండా గ్యాస్ సిలిండర్ల ధరను పెంచలేదు.ఇక నేటి నుండి ఈనెల ముగిసే వరకు కూడా సిలిండర్ ధరలు పెంచకుండా స్థిరంగా ఉండేటట్లు నిర్ణయం తీసుకున్నాయి.

భారతదేశంలో ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయిన ఐఓసి, బిపిసిఎల్, హెచ్పిసిఎల్ లాంటి కంపెనీలు వారి ఎల్పిజి సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు.దీంతో గత నెలలో ధరలు ఎలా ఉన్నాయో ఈ నెలలో కూడా అలాగే కొనసాగుతున్నాయి.

ఇక మనందరికీ తెలిసిన విధంగానే ప్రతి సంవత్సరానికి 12 సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రజలకు అందజేస్తోంది.ఇక తాజాగా ధరల ప్రకారం ఢిల్లీలో నాన్ సబ్సిడీ ఎల్పిజి సిలిండర్ ధర రూ.594 ఉండగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర కాస్త పెరిగింది.ఇందుకు సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో ఉంచిన సమాచారం మేరకు 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర 32 రూపాయలు పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇకపోతే మే నెలలో 162 రూపాయలకు పైగా సిలిండర్ తక్కువ ధరతో కస్టమర్స్ కు లభించింది.అయితే ఆ తర్వాత జూన్ నెలలో ఒక్కో ఎల్పిజి సిలిండర్ పై 11 రూపాయలు వరకు పెంచారు.

ఇక ప్రస్తుతం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎలాంటి ధరలు కొనసాగాయో అక్టోబర్ నెలలో కూడా అవే సిలిండర్ ధరలు కొనసాగుతున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలియజేశాయి.ఇక ప్రస్తుతం 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర 594 రూపాయలు వద్ద ఉండగా, ఇదివరకు 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ 1134 రూపాయలు ఉండగా 32 రూపాయలు పెరిగి తాజాగా 1160 రూపాయలకు చేరుకుంది.ఈ ఎల్పీజీ ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆధారంగా పెరగడం, తగ్గడం లాంటివి జరుగుతాయి.

ఇక ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన ధరలు కూడా ప్రతిరోజు పెరగడం లేదా తగ్గడం జరుగుతూనే ఉన్నాయి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు