ఉగాది కి గ్రామ వాలంటీర్ లను ప్రోత్సహించే రీతిలో జగన్ సరికొత్త డెసిషన్..!!

జగన్ ఆలోచనల నుండి పుట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల జీతాలు పెంచాలని ధర్నాలు నిరసనలు చేపట్టడంతో వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా చేసే వంటి క్లారిటీ ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు అందించాలని జగన్ సరికొత్త డెసిషన్ తీసుకోవడం జరిగింది.

దీంతో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం తరఫున గిఫ్ట్ అందించడానికి సరికొత్త ఆలోచనలు వైసీపీ ప్రభుత్వం చేసింది.పూర్తి మ్యాటర్ లోకి వెళితే గత ఏడాది కాలంగా ఎవరైతే తమ బాధ్యతలను సక్రమంగా ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా సేవా దృక్పథంతో చేశారో వారిని గుర్తించి మూడు కేటగిరీలో ప్రోత్సాహకాలు అందించడానికి జగన్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దీంతో సంవత్సరం పాటు నిరంతరాయంగా అందించిన గ్రామ, వార్డు వాలంటీర్ లను గుర్తించి వారికి సేవా మిత్ర పురస్కారం బ్యాడ్జి తో పాటు పది వేల రూపాయల నగదును అందించాలని జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది.ఇక రెండో కేటగిరిలో ప్రతి మండలం పట్టణంలో ఐదుగురిని ఎంపిక చేసి వారికి సేవ రత్న పురస్కారం తో పాటు 20 వేల రూపాయల నగదు కూడా అంద చేయబోతున్నారట.

ఇక మూడో కేటగిరీలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురిని ది బెస్ట్ ఎంపికచేసి సేవా వజ్ర పురస్కారంతో పాటు స్పెషల్ బ్యాచ్ మెడల్ అదే విధంగా 30 వేల రూపాయలు అందివ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు