ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) ప్రభుత్వం రీసెంట్ గానే 10 వ తరగతి పరీక్షల ( 10th Class Exams )తేదీని షెడ్యూల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.వచ్చే ఏడాది ఏప్రిల్ మూడవ తారీఖున ప్రారంభం కాబోతున్న పరీక్షలు 10 వ తారీఖు వరకు జరగనుంది.
ఇక ఫలితాలు కూడా చాలా తొందరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.కేవలం నెల వ్యవధి లోనే అనగా మే 6వ తేదీ ఫలితాలు ప్రకటించబోతున్నారు.
మార్చి 14 వ తారీఖు నుండి హాల్ టికెట్స్( Hall Tickets ) కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.ఇదంతా పక్కన పెడితే నేడు పరీక్షల ఫీజు గడువు పొడిగిస్తున్నట్టుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్త విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం కలిగించింది.కానీ గడువు తేదీ దాటితే మాత్రం కచ్చితంగా ఫైన్ తో ఫీజు కట్టాల్సిందే.
ఆ ఫైన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 30 వ తారీఖు వరకు విద్యార్థులు ఫీజుని చెల్లించుకోవచ్చు.ఒకవేళ 30 వ తారీఖు కట్టలేకపోతే డిసెంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు 50 రూపాయిల లేట్ ఫీజుతో చెల్లించాల్సి ఉంటుంది.ఆ తర్వాత 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు 200 రూపాయిల లేట్ ఫీజు తో చెల్లించాలట.
అంతకు మించి దాటితే మాత్రం 500 రూపాయలకు పైగా లేట్ ఫీజుతో చెల్లించాల్సి ఉంటుందట.అది కూడా డిసెంబర్ 10 నుండి 14 వ తేదీ వరకు మాత్రమే.
అంటే ఫీజు కట్టుకోవడానికి వచ్చే నెల 14 వ తేదీ డెడ్ లైన్ అన్నమాట.విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా, వెంటనే ఫీజు ని చెల్లించాల్సిందిగా ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

మరో విశేషం ఏమిటంటే 10 వ తరగతి హాల్ టికెట్స్ విద్యార్థులకు చేతికి వచ్చే సమయానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పొచ్చు.సరిగ్గా పరీక్షలు జరిగే సమయానికి ఎన్నికలు జరిగిపోయి ఉంటుంది.ఈ పరీక్షల ఫలితాల నెల లోనే ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి.
ఏప్రిల్ నెలాఖరు లోపు వైసీపీ పార్టీ అధికారం లోకి వస్తుందా?, లేదా టీడీపీ – జనసేన పార్టీలు అధికారం లోకి వస్తుందా అనేది తెలిసిపోతుంది.అప్పుడు మే నెలలో ఏ ప్రభుత్వం లో ఈ పదవ తరగతి ఫలితాలు వెలువడబోతున్నాయో చూడాలి.