అభినవ మహానటి కీర్తి సురేష్ జోరు ప్రస్తుతం సౌత్ లో ఒక రేంజ్ లో ఉంది.ఇప్పటికే ఈ అమ్మడు సినిమాలు ఒకటి రిలీజ్ కాగా మరో రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.
అందులో మిస్ ఇండియా ఒకటి కాగా, మరొకటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీ ఒకటి.ఈ రెండు సినిమాలు ఫిమేల్ సెంట్రిక్ స్టొరీతోనే తెరకెక్కాయి.
ఇక రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి.ఇవి కాకుండా సుమారు ఎనిమిది సినిమాల వరకు కీర్తి సురేష్ లైన్ లో పెట్టి ఉంది.
అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.సౌత్ లో కీర్తి సురేష్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తాజాగా రిలీజ్ అయిన గుడ్ లక్ సఖి టీజర్ మరోసారి ప్రూవ్ చేసింది.
ఈ సినిమాలో ఆమె ఒక గిరిజన యువతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసింది. కామెడీ, స్పోర్ట్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకుమార్ దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యుట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తుంది.స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఈ టీజర్ ని ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.యుట్యూబ్ లో టాప్ 2 ట్రెండింగ్ లో గుడ్ లక్ సఖి టీజర్ ఉండటం విశేషం.మరోసారి కీర్తి సురేష్ ఈ సినిమాలో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసిందని నెటిజన్లు నుంచి ప్రశంసలు లబిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ కి జోడీగా ఆది పినిశెట్టి నటిస్తూ ఉండటం కీర్తి కోచ్ పాత్రలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.మరి త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాని ఒటీటీలో రిలీజ్ చేస్తారా లేక థియేటర్ లో రిలీజ్ చేయడం కోసం వేచి చూస్తారా అనేది చూడాలి.