యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,బలహీనవర్గాల నేత,బీర్ల ఐలయ్యను విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతకు లేదని,ఆలేరు అభివృద్ధిని ఓర్వలేక గొంగడి సునీత చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ సెక్రటరీ భాస్కరుని రఘునాథరాజు అన్నారు.సోమవారం మోటకొండూరు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఐలయ్య అమర్యాదగా మాట్లాడారని అంటున్న మాజీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేతలను చవట,దద్దమ్మలు,సన్నాసులని మాట్లాడినప్పుడు ఎక్కడ పోయారని ప్రశ్నించారు.
అప్పుడు తప్పులేనిది ఇప్పుడు తప్పు వచ్చిందా?ఆలేరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వంలో గవర్నర్ ను దుర్భాషలాడినప్పుడు విప్ గా,సాటి మహిళగా నోరు విప్పని మీరా నైతికత గురించి మాట్లాడేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వాడిన జుగుప్సాకరమైన భాష ఏ నాయకుడు వాడలేని, రైతులకు బేడీలు వేసినప్పుడు, నిరుద్యోగులను నిర్బంధించినప్పుడు ఇలా స్పందించి ఉంటే బాగుండేదని గుర్తు చేశారు.మాజీ ఎమ్మెల్యే సునీత ప్రెస్ మీట్ చూస్తే ఆలేరులో రాజకీయ ఉనికి కోల్పోయి,ప్రజలు దూరం కొడుతున్నారనే బాధతో మాట్లాడినట్టు కనిపిస్తుందన్నారు.
ఆరు నెలల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేసిందో చూపియ్యాలని డిమాండ్ చేశారు.ఆరు నెలల్లో బీర్ల ఐలయ్య చేసిన అభివృద్ధి చూపియ్యడానికి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమండ్ల శ్రీనివాస్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు భూమండ్ల అశోక్,మాజీ ఎంపీటీసీ బాల్ద రామకృష్ణ,పాల సొసైటీ అధ్యక్షుడు బాల్ద సిద్ధులు, ఆలేరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బుగ్గ మహేష్ తదితరులు పాల్గొన్నారు.