ఫసల్ బీమా పథకం అమలు చేస్తే ఈ పరిస్తితి ఉండేది కాదు:గోలి మధుసూధన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని( Pradhan Mantri Fasal Bima Yojana ) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లనే రాష్ట్రంలో రైతులకు నష్టాలు వస్తున్నాయని బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి అన్నారు.

గురువారంనల్గొండ మండలం( Nalgonda )లోని అప్పాజీ పేట, రాములబండ,ఖుదావన్ పూర్ గ్రామాలలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల బాధలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేసినట్లయితే నేడు రైతులకు నష్టపరిహారం అందేదన్నారు.

లారీల కొరత ఉందని,సకాలంలో లారీలు రావడం లేదని రైతులు చెప్పడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి లారీలు పంపించాలని చెప్పారు.ప్రభుత్వం ధాన్యం కొనే వరకు వదిలిపెట్టేది లేదని,మీరు అధైర్య పదొద్దన్నారు.

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా కార్యదర్శి పోతెపాక లింగస్వామి, గుండా నవీన్ రెడ్డి, పాలకూరి రవిగౌడ్,రెగట్టే రుఖ్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లనే రాష్ట్రంలో రైతులకు నష్టాలు వస్తున్నాయని బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి అన్నారు.గురువారం నల్గొండ మండలంలోని అప్పాజీ పేట, రాములబండ,ఖుదావన్ పూర్ గ్రామాలలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల బాధలు( Farmers Problems ) తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం( Central Government ) ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేసినట్లయితే నేడు రైతులకు నష్టపరిహారం అందేదన్నారు.

లారీల కొరత ఉందని,సకాలంలో లారీలు రావడం లేదని రైతులు చెప్పడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి లారీలు పంపించాలని చెప్పారు.ప్రభుత్వం ధాన్యం కొనే వరకు వదిలిపెట్టేది లేదని,మీరు అధైర్య పదొద్దన్నారు.

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా కార్యదర్శి పోతెపాక లింగస్వామి, గుండా నవీన్ రెడ్డి, పాలకూరి రవిగౌడ్,రెగట్టే రుఖ్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు భాగ్యస్వాములు కావాలి : కలెక్టర్
Advertisement

Latest Nalgonda News