ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచుతున్న "జిన్నా" ఫస్ట్ లుక్

విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ నటీ నటులుగా డైనమిక్ డైరెక్టర్ ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న చిత్రం “జిన్నా“.ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

 Ginna First Look: Perfect Mass Action Film From Vishnu Is Loading Ginna, Gali N-TeluguStop.com

ఈ ఫస్ట్ లుక్ లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, మరియు చోటా కే నాయుడు కనిపించడం విశేషం.

ఈ ఫస్ట్ లుక్ లో మంచు విష్ణు ను చూస్తుంటే వైట్ & వైట్ డ్రెస్ లో ఉన్న లుక్ కు సినీ అభిమానులలో మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేయడమే కాక ఈ ‘జిన్నా’ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడని పినిపిస్తుంది , ఇంతకు ముందు విడుదల చేసిన ప్రి లుక్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.అలాగే ఇంతకుముందు విష్ణు నటించిన రెండు ‘చిత్రాలకు స్క్రిప్ట్‌లు అందించిన కోన వెంకట్ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే రాయనున్నారు.

మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు

నటీ నటులు

విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు

నిర్మాతలు : అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , దర్శకత్వం ::ఈషన్ సూర్య హెల్మ్,సినిమాటోగ్రఫి : ఛోటా కె.నాయుడు,కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్,మ్యూజిక్ : అనూప్ రూబెన్స్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube