అక్రమ కట్టడాలలో దర్సకుడు వినాయక్ భవనం కూల్చివేత  

Ghmc Breaks Down Director Vv Vinayak House-ghmc,stalin,tollywood Director,vv Vinayak,అక్రమ నిర్మాణాల,దర్శకుడు వి వి వినాయక్

అక్రమ నిర్మాణాల పై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ నగర శివారు లోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపగా, ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ కు అధికారులు ఝలక్ ఇచ్చారు. వట్టినాగులపల్లిలో ఆయన నిర్మించుకుంటున్న భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తుంది..

అక్రమ కట్టడాలలో దర్సకుడు వినాయక్ భవనం కూల్చివేత -Ghmc Breaks Down Director VV Vinayak House

ఆ ప్రాంతంలో జీహెచ్ఎం సీ అనుమతి లేకుండా ఆ భవనాన్ని నిర్మించారని,అది అక్రమ కట్టడం అయినందున అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తుంది. అలానే 111 జీవో కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని విని అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం తో ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అలానే ఆ ప్రాంతంలో ఉన్న మరిన్ని అక్రమ కట్టడాలను కూడా మున్సిపల్ అధికారులు కూల్చనున్నారు.

అక్రమంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను ఒక్కొక్కటిగా జీ హెచ్ ఎం సి అధికారులు కూల్చివేసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే వి వి వినాయక్ భవనాన్ని కూడా కూల్చివేసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో స్టాలిన్,ఆది వంటి పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వినాయక్. అయితే ఇప్పుడు ఆయన తాజా గా నటుడిగా కూడా మారి దిల్ రాజు నిర్మాణం లో వస్తున్న ఒక చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.