ప్రస్తుతం ఓటీటీ వేదిక ప్రభావం బాగా ఉంది.ఇందులో.
థియేటర్ లో విడుదలైన కొత్త సినిమాలు అన్ని కొన్ని రోజులకే స్ట్రీమ్ అవుతూ ఉంటాయి.ఒకప్పుడు థియేటర్లో సినిమా విడుదలైతే దాదాపు 100 నుంచి 150 రోజుల వరకు ఆడి.ఆ తర్వాత కొన్ని నెలల గ్యాప్ తో టీవీ లోకి వచ్చేవి.
కానీ ఇప్పుడు అలా లేదు.
ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే కేవలం ఐదు వారాల్లోకే ఓటీటీ లోకి వచ్చేస్తుంది.ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఏకంగా రెండు నుంచి మూడు వారాల్లోనే స్ట్రీమ్ అవుతాయి.

ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ‘గని‘ సినిమా కూడా త్వరలో ఓటీటీ దర్శనమివ్వనున్నట్లు తెలుస్తుంది.శుక్రవారం రోజు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.ఇక ఈ సినిమాలో కొత్తదనం లేకపోయేసరికి ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.
దీంతో ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు.
అంటే ఏప్రిల్ 29న ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహా లో స్ట్రీమ్ కానుంది.నిన్న విడుదలైన ఈ సినిమా.
మరో మూడు వారాల్లో ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ విషయం గురించి సినీ బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.