'గంధర్వ' సినిమా జూలై 8న విడుదల

సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం గంధర్వ.ఇటీవలి కాలంలో క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న గంధర్వ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పిస్తోంది.

 Ghandarwa Movie Relese 8th July Ghandarwa Movie , Tollywood, Sandeep Madhav, Gay-TeluguStop.com

ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు.ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.

ఇక గంధర్వ ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు మార్కెట్ లో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా చేశాయి.

అద్భుతమైన కొత్త పాయింట్ తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నారు.

జూలై 8 న థియేటర్లలో విడుదల కాబోతుంది.ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు.సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా ఎడిటర్ గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube