వినియోగదారులకు మరో సదుపాయం తీసుకొచ్చిన జియో..!

ప్రస్తుత రోజుల్లో ఆహారం లేకపోయినా ఉంటారేమో కానీ మొబైల్ ఫోన్ లేకుంటే జీవితం ముందుకు కొనసాగదు అన్న విధంగా తయారు అయ్యేంది జీవితం.

ఈ క్రమంలో టెలికం రంగం వారు కూడా అధిక పోటీతో వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

ఈ తరుణంలో టెలికాం రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న రిలయన్స్ సంస్థ, అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది యూజర్ లను సొంతం చేసుకుంది అలాగే ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు తగ్గట్టు తగిన ఫ్యూచర్స్, ఆఫర్స్ ప్రకటించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు కొనసాగింది.తాజాగా జియో సంస్థ నుంచే సరికొత్త ఆప్షన్ ను ప్రవేశపెట్టింది.

ఇప్పటికీ వరుకు ఎవరైనా జియో రీఛార్జ్ చేసుకోవాలంటే మై జియో యాప్ లేదా ఇతర పేమెంట్ యాప్‌ల‌ను వినియోగిస్తూ రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండేది.తాజాగా జియో తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ ద్వారా నేరుగా రీఛార్జ్ చేసుకునే వేసాలపటు కల్పించబడుతుంది.

ఇందుకు యూజర్లు రీఛార్జి చేసుకోవడానికి మొదటగా ఫోన్ లో 7000770007 నెంబర్ ను సేవ్ చేసుకొని అనంతరం వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ పంపాలి అనంతరం రీఛార్జ్ ఆప్షన్ తో పాటు, గెట్‌ న్యూ జియో సిమ్‌ ఆర్‌ పోర్ట్‌ ఇన్‌ (ఎంఎన్‌పీ),సపోర్ట్‌ ఫర్‌ జియో సిమ్‌, సపోర్ట్‌ ఫర్‌ జియో ఫైబర్‌, సపోర్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, సపోర్ట్‌ ఫర్‌ జియో మార్ట్ లాంటి తదితర ఆప్షన్లను మనం ఎంచుకునే సదుపాయం కల్పించింది.ఎవరైనా యూజర్లు రీఛార్జ్ ఆప్షన్ ను ఎంచుకుంటే వెంటనే కంపెనీ అధికారిక సైట్ లోకి వెళ్తుంది.

Advertisement

అక్కడ పేమెంట్ చేస్తే సరి, ఇట్లే రీఛార్జ్ అయిపోతుంది.అయితే ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఇంగ్లీష్, హిందీ భాషలలోనే లభిస్తుంది.

అతి త్వరలోనే దేశంలోని మరిన్ని స్థానిక భాషలలో సేవలు అందించేందుకు రిల‌య‌న్స్ జియో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు