మలయాళ భామలకు టాలీవుడ్లో లక్కీ ఆఫర్లే వస్తుంటాయి.జెంటిల్ మన్ సినిమాతో ప్రేక్షకుల మనసుదోచిన నివేదా థామస్ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుందని ఫిల్మ్ నగర్ టాక్.
అక్కినేని అఖిల్ రెండో సినిమాగా చేస్తున్న సినిమాలో నివేదా హీరోయిన్ గా ఓకే అయ్యిందట.విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నవంబర్ లో స్టార్ట్ అవనుంది.
లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ముస్లిం కుటుంబంలో పెరిగే హింది కుర్రాడిగా అఖిల్ నటించబోతున్నాడట.
మొదటి సినిమా అఖిల్ తో ఫుల్ క్రేజ్ సంపాదించిన అఖిల్ ఆ సినిమా ఫ్లాప్ తో సంవత్సరం గడుస్తున్నా సినిమా ఓకే చేయలేదు.
తన సినిమా రేసులో దర్శకులందరికి టెస్ట్ చేసి ఫైనల్ గా విక్రంతో సినిమాకు సిద్ధమయ్యాడు.మనంతో ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉన్న విక్రం కుమార్ ఇప్పుడు అఖిల్ సినిమా చేయడం గొప్ప విషయం.
ఇక సినిమాలో హీరోయిన్ గా నివేదా నటించడం కూడా సినిమాకు హిట్ సెంటిమెంట్ తోడైనట్టే మరి మొదటి సినిమా ఇచ్చిన షాక్ నుండి బయటపడాలంటే విక్రం సినిమాతో హిట్ అందుకోవాల్సిందే.
.






