జ్ఞాపకశక్తి మెండుగా ఉండటం అందరికి అవసరమే.ఏదో పనిలో పడి ఇంకేదో పనిని మర్చిపోవడం, కొన్ని ముఖ్యమైన రోజులు మర్చిపోవడం లాంటివి రోజూ చూస్తుంటాం.
ఇక విద్యార్థులకైతే జ్ఞాపకశక్తే పెట్టుబడి.ఎందుకంటే మన విద్యవ్యవస్థ జ్ఞానాన్ని కాదు, జ్ఞాపకశక్తిని పరీక్షిస్తుంది.
ఎన్ని జవాబులు గుర్తుంటే పరీక్షలు అంత బాగా రాయొచ్చు.మరి జ్ఞాపకశక్తి ఎలా పెంచుకోవాలో అందరు తెలుసుకోవాల్సిందేగా.
* మెడిటేషన్ చేయడం ద్వారా మెదడుకి కావాల్సిన జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.ఎందుకంటే ఉదయాన్నే మెడిటేషన్ చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బ్రెయిన్ సెల్స్ పెంచుకోవచ్చు.
* వ్యాయామం కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి.ఎందుకంటే చిన్నిపాటి వ్యాయామం బ్రెయిన్ సెల్స్ ని యాక్టివ్ గా ఉంచుతుంది.
* ఎప్పుడైనా అలోచించారా? పరీక్షకు బయలుదేరేముందు పెద్దవారు పెరుగు ఎందుకు తినిపిస్తారో ? ఎందుకంటే ఇందుకో ప్రొబయోటిక్స్ లభిస్తాయి.ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
ప్రొబయోటిక్స్ లభించే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోండి.
* మెదడుకి మేత పెట్టే గేమ్స్ ఆడటం బ్రెయిన్ సెల్స్ కి చాలా మంచిది.
ముఖ్యంగా చెస్, పజిల్స్ లాంటివి.
* స్ట్రెస్, ఒత్తిడి లాంటివి జ్ఞాపకశక్తికి కీడు చేస్తాయి.
కాబట్టి మెదడుని ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి.
* కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త భాష, పదాలు నేర్చుకోవడం, ఆసక్తి ఉన్న టాపిక్ మీద రిసెర్చి చేయడం కూడా బ్రెయిన్ సెల్స్ ని ఉత్తేజితపరుస్తాయి
.






