కింగ్ నాగార్జున ఫాం చూస్తుంటే స్టార్ హీరోలు కూడా ఇప్పుడు నాగ్ సినిమా అంటే భయపడే పరిస్థితికి వచ్చింది.ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న నాగార్జున ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు.
ఇక హీరో శ్రీకాంత్ తనయుడు హీరోగా నిర్మలా కాన్వెంట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు.
సెకండ్ హాఫ్ మొత్తం నాగ్ ఉంటాడని టాక్.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున రివ్యూ రైటర్స్ మీద కొరడా ఝుళిపించాడు.
ఏ సినిమా అయినా అందులో కంటెంట్ ఉంటే అదే ఆడుతుంది.ఇక రివ్యూ రేటింగ్ మీద ఆధారపడి సినిమా ఫలితం ఉంటుందంటే అసలు నమ్మను అంటున్నాడు నాగార్జున.
ఈ మధ్య సినిమా రేటింగ్ తో సంబంధం లేకుండా హిట్ అయిన సినిమాలు ఉన్నాయని.అందుకే తానెప్పుడు రివ్యూ రేటింగ్ మీద నమ్మకం ఉంచలేదని అంటున్నాడు నాగార్జున.
రోషన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో అన్ని తానై నడిపిస్తున్నాడు నాగ్.రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి లాభాలను తెచ్చిపెట్టింది.







