డోరియన్‌ విధ్వంసంలో చనిపోయింది ఎంతమంది..? ఆ 200 శవపేటికలు ఎందుకు..?

అట్లాంటిక్ తీరం నుంచి బహమాస్ దీవుల్ని నామరూపాల్లేకుండా చేసిన డోరియస్ హరికేన్ ధాటికి మరణించిన వారి సంఖ్య లెక్కకు అందడం లేదు.

అధికారికంగా 20 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఆ లెక్క వందల్లోనే ఉండవచ్చిన పలువురు భావిస్తున్నారు.

వీరి వాదనకు బలాన్ని చేకూరుస్తూ 200 శవపేటికలు, మృతదేహాలను భద్రపరిచే ఐఎస్ బాక్సులను ప్రభుత్వం అబాకో నుంచి బహమాస్‌తో పాటు హరికేన్ ప్రభావిత ప్రాంతాలకు తరలించారు.

కాగా.బహమాస్ దీవుల్లోని కొన్ని చోట్ల పెద్దమొత్తంలో శరీర భాగాలు కనిపించడంతో కొందరిలో ఆందోళన మొదలైంది.ఇదే అంశంపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శాండ్స్ మాట్లాడుతూ.

ఆ శరీర భాగాలు ఎవరివో ఆరా తీస్తున్నామని.డోరియన్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 20 అయితే కాదని అది ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

కాగా.బహమాస్‌లో డోరియన్ కారణంగా దాదాపు 1300 ఇళ్లు నేలమట్టం కాగా.

చెట్లు, కరెంట్ స్తంభాలు కొట్టుకుపోయాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బహమాస్ దీవులతో పాటు అబాకో దీవులు కూడా సముద్రంలో కలిసిపోయాయి.

దీంతో అక్కడి ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.మరోవైపు బహమాస్‌ను అతలాకుతలం చేసిన డోరియన్ హరికేన్ అమెరికా తూర్పు తీరంవైపుగా దూసుకెళ్తోంది.

ఈ తుఫాను మరింత బలపడి కేటగిరీ-3గా మారి.దక్షిణ కరోలినా తీరాన్ని తాకే అవకాశం ఉందని.జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??

డోరియన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అదుకునేందుకు అంతర్జాతీయ సమాజం రంగంలోకి దిగింది.లాటిన్ అమెరికా దేశాలతో పాటు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ హరికేన్ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు