మళ్ళీ గర్భవతి అయిన హీరోయిన్

హహ హాసిని అంటూ, తెలుగు ప్రజలను మురిపించింది జెనిలియా.పేరుకి బాలివుడ్ భామే అయినా, సినిమాలు ఎక్కువగా దక్షిణాదిలోనే చేసింది.

హింది, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ తన మొదటి చిత్రం తుఝే మేరి కసమ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్లాడింది.పెళ్లి తరువాత సినిమాలు పూర్తిగా వదిలేసిన జెనిలియా, 2014 నవంబరులో ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది.

ఆ బాబు పేరు రియాన్.ఇక కొత్తగా వినబడుతున్న వార్త ఏమిటంటే మన హాసిని మళ్ళి గర్భం దాల్చిందట.

బుల్లి రియాన్ కి త్వరలోనే ఓ తమ్ముడు లేదా చెల్లి రాబోతున్నారట.హింది సినీ జర్నలిస్టు ఒకరు మాట్లాడుతూ " అవును, జెనిలియా ప్రస్తుతం గర్భవతి.ఈ విషయం పట్ల రితేష్, జెనిలియా చాలా సంతోషంగా ఉన్నారు.2016 మొదట్లోనే జెనిలియా తన బిడ్డకి జన్మనివ్వబోతోంది " అంటూ జెనిలియా ప్రెగ్నెన్సిని కన్ఫర్మ్ చేసారు.

Advertisement
 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?

తాజా వార్తలు