Geetu Royal Bigg Boss Show : డబ్బులు ఇచ్చినా మోసం చేశారు.. గీతూ రాయల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

బిగ్ బాస్ షో టాప్5 కంటెస్టెంట్లలో గీతూ రాయల్ ఒకరిగా నిలుస్తారని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

బిగ్ బాస్ హౌస్ లో మనం రియల్ లైఫ్ లో ఎలా ఉంటామో అలా ఉంటే టాప్5 లో నిలుస్తామని గీతూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గీతూ రాయల్ తాజాగా యూట్యూబ్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చారు.గీతూ రాయల్ 70 నిమిషాల వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోలో గీతూ అవును నేను ఓడిపోయాను అంటూ చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ముందు నన్ను ప్రమోట్ చేయాలని కొంతమందికి 25,000 రూపాయలు ఇచ్చానని ఆమె తెలిపారు.అయితే డబ్బులు తీసుకున్న వాళ్లు నా గురించి పాజిటివ్ గా కామెంట్లు చేయకుండా మోసం చేశారని గీతూ రాయల్ కామెంట్లు చేశారు.

నేను నమ్మిన ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేశారని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు.కొంతమంది నుంచి, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందనే ఆలోచనతో మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టానని గీతూ రాయల్ పేర్కొన్నారు.

Advertisement

అయితే వాళ్ల నుంచి నాకు ఎలా సపోర్ట్ లభించలేదని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అర్థమైందని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఈ విధంగా జరగడం నన్ను తీవ్రంగా బాధించిందని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు.అభిజిత్, కౌశల్ తో పోల్చి చూస్తే నేనేం తక్కువని గీతూ రాయల్ ప్రశ్నించారు.వాళ్లు చేస్తే రైట్ నేను చేస్తే తప్పైందా అని ఆమె అన్నారు.

గీతూ రాయల్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గీతూ రాయల్ యూట్యూబ్ వీడియోను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు