గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

పదేళ్ల క్రితం అంజలి( Anjali ) డ్యూయల్ రోల్ లో వచ్చిన హారర్ కామెడీ ‘గీతాంజలి’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా గీతాంజలి మళ్లీ వచ్చింది ( Geethanjali Malli Vacchindi ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నేడు ఏప్రిల్ 11వ తేదీ విడుదల అయినటువంటి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

కథ:

పార్ట్ 1 చివర్లో గీతాంజలి(అంజలి) దయ్యంగా వచ్చి తనని చంపిన రమేష్(రమేష్ రావు) ని చంపేస్తుంది.ఈ సీక్వెల్ లో గీతాంజలి దయ్యం నుంచే కథని మొదలుపెట్టారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది కథ హైద్రాబాద్‌లో ఓపెన్ అయినా కూడా ఊటీలోనే జరుగుతుంది.ఈ సినిమా సీక్వెల్ అని అర్థమయ్యేలా ఫస్ట్ పార్ట్‌కి సంబంధించిన స్టోరీని కూడా చూపిస్తారు.

శ్రీను (శ్రీనివాస్ రెడ్డి), ఆరుద్ర (షకలక శంకర్), ఆత్రేయ (సత్యం రాజేష్)లు సినిమా ఛాన్స్ కోసం హైద్రాబాద్‌లో కష్టపడుతుంటారు.అయాన్ (సత్య) హీరో అవుతానని కలలు కంటాడు.

Advertisement

పార్ట్ 1లో గీతాంజలి చెల్లి అంజలి(అంజలి డ్యూయల్ రోల్) ఇక్కడే ఊటీలో కాఫీ షాప్ నడిపిస్తుంది.విష్ణు వీరికి సినిమా ఛాన్స్ ఇచ్చి, అక్కడ ఉన్న భూత్ బంగ్లా సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా పెట్టాలని కండిషన్స్ పెడతాడు.

ఇలా కండిషన్లు పెట్టడంతో ఆ బంగ్లాలో సినిమా చేయడం అంటే భయపడతారు ఎందుకంటే అక్కడికి వచ్చిన వారందరూ చనిపోవడంతో దానిని బూత్ బంగ్లా అంటూ పిలుస్తారు.అసలు అక్కడికి వచ్చిన వారు ఇలా ఎందుకు చనిపోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది.అక్కడ జరుగుతున్న హత్యల వెనుకున్న కథ ఏంటి? ఈ విష్ణు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంజలి, శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలను ఎందుకు ఒక చోటకు తీసుకొచ్చారు.గీతాంజలి మళ్లీ ఎందుకు వచ్చింది అన్నది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన

: హీరోయిన్గా గీతాంజలి ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన నటనతో మెప్పించారు.ఇక గీతాంజలి సినిమాలో కూడా ఈమె దయ్యం పాత్రలోను అలాగే సాధారణ క్యారెక్టర్ లోను నటించే ప్రేక్షకులను మెప్పించారు.

శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ అవినాష్, పవిత్ర.వీళ్లంతా తమ కామెడీతో ఫుల్ గా నవ్విస్తారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

రవిశంకర్, ప్రియా దయ్యాల పాత్రల్లో ఒదిగిపోయారు.ఇలా ప్రతి ఒక్కరు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Advertisement

టెక్నికల్:

ఈ సినిమా మొత్తం ఊటీ లోనే జరగడంతో అక్కడ ప్రకృతి అందాలు చాలా కనవిందుగా ఉన్నాయి.ఇక సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

డైలాగ్స్ ఫుల్ గా నవ్విస్తాయి.కథ కథనం కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది.

నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ:

హారర్ కామెడీ అన్నప్పుడు హారర్, కామెడీ ఈ రెండు అంశాలని పర్ఫెక్ట్ గా సెట్ చేయాలి.పార్ట్ 1లో అది కరెక్ట్ గా ఉండటంతో మంచి సక్సెస్ అయింది పార్ట్ 2 లో మాత్రం కామెడీ ఎక్కువగా ఉండి హర్రర్ తగ్గిపోయిందని చెప్పాలి ఫస్ట్ హాఫ్ మొత్తం కొత్తగా ఏమీ అనిపించలేదు కానీ సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త ఉత్కంఠతను కొనసాగించింది ఇక కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యి ప్రేక్షకులందరికీ కడుపుబ్బ నవ్వించింది.క్లైమాక్స్ కూడా కొంచెం ఆసక్తికరంగా నడిపించినా క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి.

క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ కూడా కొంచెం తేలిపోతాయి.

బాటమ్ లైన్

: గీతాంజలి సినిమా సక్సెస్ కావడంతో అదే అంచనాలతోనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా పర్ఫెక్ట్ హారర్ కామెడీగా ప్రేక్షకులని కచ్చితంగా మెప్పిస్తుంది.

రేటింగ్: 3/5

తాజా వార్తలు