ఈ రోజుల్లో సినిమాల్లో రాణిస్తున్న హీరోయిన్లకు నటన, డ్యాన్స్ తప్పితే మిగతా ప్రతిభలు ఏవీ ఉండటం లేదు.ఇప్పటికీ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారు కానీ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.
కానీ ఒకప్పుడు హీరోయిన్లు నటనతో పాటు సంగీతంలో కూడా రాణించేవారు.తమ పాత్రలకు సంబంధించిన పాటలను వారే సొంతంగా పాడేవారు.
అలాంటి బహుముఖ ప్రతిభావంతులలో ఎస్.వరలక్ష్మీ, భానుమతి, కన్నాంబ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా కన్నాంబ( Kannamba ) సంగీతంలో బాగా రాణించింది.
ఏలూరులో 1912లో పుట్టిన కన్నాంబ 13 ఏళ్లకే రంగస్థలం నటిగా మారింది.
అక్కడ నటనలో బాగా మెలకువలు నేర్చుకుంది.ఆ నటన నైపుణ్యంతో ‘హరిశ్చంద్ర (1935)’ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం అందుకుంది.
ఇందులో చంద్రమతిగా, ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ ( Draupadi Vastrapaharanam ) చిత్రంలో ద్రౌపదిగా ఆమె జీవించింది.ఈ ఒక్క సినిమాతో ఆమెపై చాలామంది దర్శకుల దృష్టి పడింది.
దాని ఫలితంగా చాలానే అవకాశాలు వచ్చాయి.ఆమె చేసిన సూపర్ హిట్ సినిమాలలో పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి, అనార్కలి, దక్షయజ్ఞం, తోడికోడళ్ళు కొన్ని.
ఆ కాలంనాటి దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి ఈమె స్క్రీన్ షేర్ చేసుకుంది.కెరీర్ మొత్తంలో ఏకంగా 150కి పైగా సినిమాల్లో నటించింది.
పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో కన్నాంబ చూపించిన నటనా వైవిధ్యం చాలా మందిని ఆకట్టుకుంది.
చిత్ర దర్శకుడు, నిర్మాత కడారు నాగభూషణం( Produced Kadaru Nagabhushanam ) , కన్నాంబ ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం పేరిట ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు.దీని కింద తెలుగు,తమిళ భాషల్లో 22 సినిమాలు తీసి బాగానే లాభాలను గడించారు.
ఒకటో తేదీకి ముందే జీతాలు ఇచ్చి ఉద్యోగులను బాగా చూసుకునే సంస్థగా ఈ ప్రొడక్షన్ హౌస్ కి మంచి పేరు కూడా వచ్చింది.కన్నాంబ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని గ్లామర్ తో కనిపించేది.

కన్నాంబ హీరోయిన్లతో సమానంగా చీరలను, బంగారు ఆభరణాలను ధరించేది.వీరి ధరించిన వాటికి సామాన్య ప్రజల్లో చాలా డిమాండ్ ఉండేది.‘కన్నాంబ లోలాకులు‘ అంటూ అప్పట్లో వ్యాపారులు వాటిని విక్రయిస్తూ బాగానే లాభాలను పొందేవారు.నటిగా, నిర్మాతగా కన్నాంబ ఆ రోజుల్లోనే లక్షల రూపాయలను వెనకేశారు.
ఆమె చనిపోయాక ప్రొడక్షన్ కంపెనీ, ఆస్తులు అన్నీ ఆవిరి అయిపోయాయి.దానికి కారణమేంటో తెలియ రాలేదు.
కన్నాంబ చనిపోయాక భర్త నాగభూషణం ఒక చిన్న గదికి పరిమితం అయ్యాడట.

అయితే కన్నాంబ మృతదేహం మాయమైపోవడం అప్పట్లో పెద్ద చర్చినీయాంశం అయింది.కన్నాంబ కుటుంబ కులాచారం ప్రకారం మృతదేహానికి సంబంధించి చాలానే నియమాలు ఉండేవి.వాటిలో ప్రధాన నియమం ఏంటంటే భార్య చనిపోతే ఆమెకు సంబంధించిన నగలను ఆమె మృతదేహానికి తొడిగి పూడ్చి పెట్టాలి.
కన్నాంబ విషయంలోనే అలాగే నగలతో ఆమె భౌతికకాయాన్ని పూడ్చేశారు.అయితే ఖననం జరిగిన రెండు రోజులకే కొందరు దొంగలు ఆమె మృతదేహాన్ని వెలికి తీసి ఆభరణాలను కాజేశారు.
అది చాలదన్నట్టు కన్నాంబ మృతదేహాన్ని ఎవరికీ దొరకకుండా మాయం చేశారు.పోలీసులు ఆమె డెడ్ బాడీని కనిపెట్టడానికి ఎంతో ప్రయత్నించాలి కానీ విఫలమయ్యారు.ఆ బాడీ ఎక్కడికి వెళ్ళింది అనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.