టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ గీత మాధురి( Geetha Madhuri ) ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను ఆలపించి సింగర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే గీత మాధురి 2014 వ సంవత్సరంలో నటుడు నందుని( Nandu ) ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు 2019వ సంవత్సరంలో అమ్మాయి జన్మించారు.
ఇలా బిడ్డకు జన్మనిచ్చినటువంటి గీత మాధురి మరోసారి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇటీవల వెల్లడించారు.
ఇక గత కొద్ది రోజుల క్రితం గీతామాధురి సీమంతపు వేడుకలు( Geetha Madhuri Baby Shower ) కూడా ఎంతో ఘనంగా జరిగాయి అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా గీతా మాధురి నందు మరోసారి తల్లిదండ్రులుగా( Parents ) మారారని తెలుస్తోంది గీత ఇటీవల పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చారు.ఇదే విషయాన్ని గీతా మాధురి నందు ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు కానీ బాబు ఫోటోని మాత్రం చూపించలేదు.
ఇక ఈ దంపతులకు శనివారం బాబు జన్మించగా ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇలా బాబు పుట్టడంతో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలియజేశారు.ఈ విధంగా గీత మాధురి నందు మరోసారి తల్లిదండ్రులు అయ్యారని వీరికి బాబు జన్మించారు అనే విషయం తెలియడంతో అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇది వరకే గీతామాధురికి అమ్మాయి జన్మించగా ఇప్పుడు అబ్బాయి జన్మించడంతో కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషంలో ఉన్నారు.