LinkedIn : లింక్డ్‌ఇన్‌లో చిన్న ఉద్యోగం కోల్పోయిన మహిళ.. మరుసటి రోజు ఊహించని సర్‌ప్రైజ్..

సాధారణంగా ఉద్యోగం కోల్పోతే ఆర్థికంగా ఎమోషనల్‌గా చాలా దెబ్బ తినాల్సి వస్తుంది.అయితే కొన్నిసార్లు ఉద్యోగం పోవడం వల్ల మంచే జరుగుతుంది.

 Fired From Linkedin Woman Gets Job At Google At Double Salary With A Video-TeluguStop.com

ప్రస్తుత ఉద్యోగం పోవడం వల్ల మెరుగైన అవకాశాలు మనకి లభించవచ్చు.తాజాగా ఒక యువతి కూడా ఉద్యోగం( Job ) పోగొట్టుకుంది.

మరుసటి రోజు ఆమెకు పోయిన జాబ్ కంటే ఎక్కువ శాలరీ ఆఫర్ చేసే జాబ్ వచ్చింది.దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వివరాల్లోకి వెళితే, మరియానా కొబయాషి( Mariana Kobayashi ) లింక్డ్‌ఇన్‌లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేది.కానీ ఆమె ఉద్యోగం పోయింది, దాంతో కొత్త ఉద్యోగం కోసం వెతకవలసి వచ్చింది.

Telugu Fired Linkedin, Google Dublin, Job Search, Linkedin-Latest News - Telugu

ఆమె డబ్లిన్‌లోని గూగుల్‌( Google )లో పని చేయాలనుకుంది.అందుకే అక్కడి రిక్రూటర్లను ఆకట్టుకునేందుకు ఓ వీడియో చేసింది.ఆమె తన వీడియోను లింక్డ్‌ఇన్‌లో( Linkedin ) పోస్ట్ చేసి, గూగుల్‌లో ఉద్యోగం పొందడానికి ఏం చేశానో ప్రజలకు చెప్పింది.జాబ్ సంపాదించడానికి మనం ఇతర దరఖాస్తుదారుల నుంచి భిన్నంగా ఉండాలని ఆమె తెలిపింది.

సృజనాత్మకంగా ఉండాలని, నైపుణ్యాలను ప్రదర్శించాలని పేర్కొంది.తన పద్ధతిని కాపీ కొట్టాలని ప్రజలను కోరింది.

ఉద్యోగులను నియమించుకుంటున్న వ్యక్తులను సంప్రదించాలని, ఆ జాబ్ కు ఎందుకు బాగా సరిపోతారో వారికి క్రియేటివ్ గా చెప్పాలని కూడా ఆమె చెప్పుకొచ్చింది.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇలా లేకపోతే మంచి జాబ్ పొందడం కష్టమని వెల్లడించింది.

Telugu Fired Linkedin, Google Dublin, Job Search, Linkedin-Latest News - Telugu

తన వీడియోలో, ఆమె తన గురించి ఒక నిమిషం మాట్లాడింది.రిఫరల్‌తో CSA ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకున్నానో ఆమె చెప్పింది.తను చిన్నప్పుడు ఏం చేసేది, ఇంతకు ముందు ఎలాంటి ఉద్యోగాలు చేశానో చెప్పింది.ఆమె తన వ్యక్తిత్వాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శించింది.ఆమె పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో చాలా దృష్టిని ఆకర్షించింది.దీనికి ఇతర వినియోగదారుల నుండి 160 దాక స్పందనలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube