మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.నెల్లూరు డైకస్ రోడ్డు నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయగిరిలోని మెరిట్ కాలేజీ వరకూ తీసుకెళ్తారు.
అనంతరం అక్కడే గౌతంరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.
అయితే అంత్యక్రియలకు గౌతంరెడ్డి భౌతిక కాయాన్ని తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు.
ఈ వాహనాన్ని చెన్నై నుంచి రప్పించారు.ఫేర్ వెల్ ఆన్ వీల్స్ పేరుతో ఈ వాహనాన్ని పిలుస్తుంటారు.
అంత్యక్రియల కోసం బెంజ్ కంపెనీ ఈ వాహనాన్ని తయారు చేస్తుంది.
ఈ వాహనంలో ఏసీ, సీసీ కెమెరాలతో పాటుగా.
హైడ్రాలిక్ సిస్టం కూడా ఉంటుంది.భౌతికకాయంతో పాటుగా మరికొందరు లోపల కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
ఈ వాహనంలోనే గౌతం రెడ్డి భౌతికకాయాన్ని ఉదయగిరి తరలిస్తారు.