మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( ( Sai Dharam Tej ) ఒకరు.
మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్ట పడుతున్నాడు.
మెగా హీరో అనే చట్రం నుండి బయటపడి తనకంటూ స్పెషల్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించు కోవాలని బాబు ఆరాట పడుతున్నాడు.
ఈ క్రమంలోనే సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన విరూపాక్ష సినిమా( Virupakasha )తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తర్వాత సాయి తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా బ్రో (Bro) లో నటించగా ఇది యావరేజ్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు సాయి తేజ్.బ్రో తర్వాత కొద్దీ విరామం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాను సెట్స్ మీదకు తెచ్చాడు.
సంపత్ నంది( Director Sampath Nandi ) దర్శకత్వంతో సాయి తేజ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాను ఈ రోజు సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు.
సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత సంపత్ నంది ( Sampath Nandi ) సాయి తేజ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు.ఈ సినిమా ఈ రోజు స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది.
జైలు నేపథ్యంలో సాగే ఈ సినిమాను డీసెంట్ బడ్జె ట్ తో తెరకెక్కించ నున్నట్టు తెలుస్తుంది.ఇక సాయి తేజ్ పూర్తిగా మాస్ అండ్ రగ్డ్ లుక్ లో అయితే కనిపించనున్నారట.
మరి ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.గంజాయి శంకర్ ( Ganjayi Shankar) అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్టు టాక్.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్ నంది సాయి తేజ్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడు.
చూడాలి ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుందో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy