Ganesh Baraiya : ఎత్తు మూడడుగులు.. ప్రభుత్వాన్నే ఎదురించి డాక్టర్.. గణేష్ బరయ్య సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒక పేరు తెగ వైరల్ అవుతోంది.ఆ వ్యక్తి పేరు గణేష్ బరయ్య( Ganesh Baraiya) కాగా ప్రభుత్వాన్ని ఎదురించి డాక్టర్ అయిన ఇతని సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.72 శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధ పడుతున్న గణేష్ బరయ్య ఎత్తు కేవలం 3 అడుగులు కావడం గమనార్హం.బాల్యం నుంచి గణేష్ బరయ్య డాక్టర్ కావాలని భావించేవారు.

 Ganesh Baraiya Inspirational Success Story Details Here Goes Viral In Social Me-TeluguStop.com

గణేష్ బరయ్య బరువు కేవలం 18 కిలోలు.వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం వల్ల ఈ వ్యక్తికి ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు.

శారీరక వైకల్యం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా గణేష్ మాత్రం కోర్టుకు వెళ్లి మరీ లక్ష్యాన్ని సాధించాడు.గుజరాత్ కు చెందిన గణేష్ బరయ్య ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా( Shortest Doctor ) అరుదైన రికార్డ్ ను సాధించి వార్తల్లో నిలిచారు.ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో గణేష్ బరయ్య 2018లో ఉత్తీర్ణత సాధించాడు.అయితే తగినంత ఎత్తు లేడనే కారణం చూపుతూ ఎంబీబీఎస్( MBBS ) లో పవేశానికి గణేష్ ను అనుమతించలేదు.

ఎత్తు వల్ల అత్యవసర కేసులను నిర్వహించడం గణేష్ కు సాధ్యం కాదని భారత వైద్య మండలి కమిటీ నుంచి సైతం గణేష్ కు తిరస్కరణ ఎదురైంది.సుప్రీం కోర్టు( Supreme Court ) తలుపు తట్టిన గణేష్ కు కోర్టు తీర్పు అనుకూలంగా రావడం గమనార్హం.

ప్రస్తుతం గణేష్ బరయ్య ఇంటర్న్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు.

సాధారణ రైతు కొడుకు అయిన గణేష్ కు జీవితంలో ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు.అయితే ఏరోజు గణేష్ మాత్రం వెనుకడుగు వేయలేదు.తన సక్సెస్ స్టోరీతో( Ganesh Baraiya Success Story ) గణేష్ వార్తల్లో నిలవడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

గణేష్ బరయ్యను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube