అక్కడ బుకింగ్స్ లో ఆహా అనిపిస్తున్న చరణ్ గేమ్ ఛేంజర్.. ఏం జరిగిందంటే?

తమిళ దర్శకుడు శంకర్( Tamil director Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్( Game changer ).

కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

అంతేకాకుండా ఇవి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.ఈ సినిమా విడుదలకు మరొక ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే యుఎస్ మార్కెట్లో కంటే యూకే మార్కెట్లో( UK market ) ఈ సినిమాకు సెన్సేషనల్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి.వీటితో పాటు పలు ప్రాంతాల్లో ఫ్యాన్ స్పెషల్ షోస్ కూడా ప్లాన్ చేసుకుంటుండగా అవి ఇప్పుడు ఒకొక్కటిగా సోల్డ్ ఔట్స్ పడుతున్నాయి.

Advertisement

దీనితో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ర్యాంపేజ్ మామూలు లెవెల్ లో లేదని చెప్పాలి.

అలాగే మరిన్ని షోస్ ని కూడా యూకే లో యాడ్ చేస్తున్నట్టుగా మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.ఇలా మొత్తానికి గేమ్ ఛేంజర్ మేనియా ఒక రేంజ్ లో నడుస్తోంది.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటించిన సినిమా కావడంతో ఈ మూవీఫై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.దానికి తోడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

రచ్చ గెలిచి ఇంట గెలవలేదుగా.. ఎన్టీఆర్, బన్నీలకు ఒకే సమస్య ఎదురైందా?
Advertisement

తాజా వార్తలు