యువ సంఘర్షణ సభలో గద్దర్ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో గద్దర్ ( Gaddar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) నిర్వహించిన ఈ సభలో గద్దర్ కళాకారులతో కలసి పాటలు పాడటం జరిగింది.

 Gaddar Sensational Comments In Yuva Sangharshan Sabha Details, Congress, Gaddar-TeluguStop.com

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో పార్టీ ప్రకటన చేస్తానని పేర్కొన్నారు.త్వరలోనే పార్టీ పేరు ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.

అన్ని రాజకీయ పార్టీలు కలసి వస్తాయని అన్నారు.దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు.

అంతేకాదు వచ్చే ఎన్నికలలో కేసీఆర్ పై( KCR ) పోటీ చేస్తానని గద్దర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ సభలో నిరుద్యోగులు మరియు యువత భారీ ఎత్తున హాజరు కావడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు.ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో జరగబోయే ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మరియు విద్యార్థులు కూడా… సభా ప్రాంగణంలో భారీగా తరలిరావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube