చిరంజీవి సినిమాలో నటించబోతున్న గద్దర్.. క్రేజీ అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆచార్య" సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తన తరువాత సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న టువంటి "గాడ్ ఫాదర్" సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మలయాళం సూపర్ హిట్ మూవీ "లూసిఫర్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం వివిధ భాషల నుంచి బాగా ఫేమస్ అయిన సెలబ్రెటీలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రజా యుద్ధ నౌక, జననాట్యమండలి కళాకారుడు గద్దర్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ విషయం గురించి గద్దర్ ను సంప్రదించగా అందుకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే తరువాత చిత్రీకరించబోయే షెడ్యూల్ లో భాగంగా గద్దర్ పై సన్నివేశాలను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు