ఈ స్మార్ట్ యూగంలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ రాజ్యమేలుతున్నాయి.అందుకనే ఈ యుగాన్ని కొందరు ఔత్సాహికులు స్మార్ట్ యుగం అని పిలుస్తున్నారేమో.
ఈ క్రమంలో దేశంలో వివిధ రకాల కంపెనీలు అప్డేటెడ్ మొబైల్ వెర్సిన్స్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.తాజాగా అత్యంత వేగంగా ఛార్జింగ్ పూర్తయ్యే సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇన్ ఫినిక్స్ కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది.
జీరో అల్ట్రా పేరుతో తెస్తున్న ఈ 5 జీ ఫోన్ కేవలం 12 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చాలా నమ్మకంగా చెబుతోంది.
ఇక ఆల్రెడీ దాన్ని టెస్ట్ చేసిన నిపుణులు కూడా ఆ మాటే చెబుతున్నారు.
జాగా ఈ నెల 25 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు ప్రారంభించనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించడం విశేషం.కాగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999 గా కంపెనీ నిర్ణయించింది.ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్, 6.8 అంగుళాల ఫుల్ HD అమోల్డ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ లాక్, 200 MP ప్రైమరీ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్, మరో 2 MP డెప్త్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 MP, బ్యాటరీ సామర్థ్యం 4500 MAHగా వుంది.

గమనిక:
180 వాట్ల సామర్థ్యంతో దేశంలోనే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫోన్లలో సూపర్ ఫాస్ట్ గా ఛార్జయ్యే ఫోన్ గా జీరో అల్ట్రా రికార్డులు సృష్టించబోతోంది.
ఇతర స్పెసిఫికేషన్స్:
1.6.8 అంగుళాల ఫుల్ HD అమోల్డ్ డిస్ ప్లే
2.ఫింగర్ ప్రింట్ లాకింగ్ సిస్టం
3.200 MP ప్రైమరీ కెమెరా
4.13 MP అల్ట్రా వైడ్
5.2 MP డెప్త్ కెమెరా
6.ఫ్రంట్ కెమెరా 32 MP,
7.బ్యాటరీ 4500 MAH







