ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యాయి.అయితే ప్రస్తుతం తెలుగు సినిమా సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయాయని చెప్పాలి.
తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన సినిమాలు ఎల్లలు దాటి ప్రేక్షకుల ముందుకు వెళుతున్నాయి.ఇలా చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలు ఇతర దేశాలలో విడుదల అవడం మనం చూస్తున్నాము.
తెలుగులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇతర దేశాలలో కూడా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టాయి.ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే.
గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైనటువంటి పుష్ప సినిమా కేవలం తెలుగులోనే కాకుండా భారీ కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఇండియాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమాని తిరిగి రష్యాలో రష్యన్ భాషలో విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.
ఈ క్రమంలోనే డిసెంబర్ 8వ తేదీ ఈ చిత్రాన్ని రష్యాలో విడుదల చేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర బృందం మొత్తం రష్యాలో పర్యటించి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 8వ తేదీ విడుదలైనటువంటి పుష్ప సినిమాను కేవలం మూడు రోజుల్లోనే థియేటర్ నుంచి తొలగించారు.ఇండియాలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పుష్ప సినిమా రష్యా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.దీంతో ఈ సినిమా ఏకంగా మూడు కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చిందని ఇండస్ట్రీ సమాచారం.
ఇకపోతే ఇండియాలో పుష్ప సినిమా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.







