ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ఇవాళ్టి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.ఈ మేరకు ‘ మేమంతా సిద్ధం’( Memantha Siddham ) పేరుతో బస్సు యాత్రను ఆయన ప్రారంభించనున్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభం కానున్న బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగనుంది.ఈ క్రమంలో ముందుగా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్( YSR Ghat ) వద్ద సీఎం జగన్ ప్రార్థనలు నిర్వహించనున్నారు.
అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra )ను ప్రారంభించనున్నారు.ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా బస్సు యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకోనుంది.
సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.సభ ముగిసిన అనంతరం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు బస్సు యాత్ర చేరుకోనుంది.
కాగా సీఎం జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో పార్టీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
.






