ఏపీ తెలంగాణలో ఒకే సారి బొమ్మ పడేలా ప్రయత్నాలు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు అక్కడక్కడ నడుస్తున్నాయి.వందల సంఖ్యలో ఉన్న థియేటర్లలో కనీసం పదుల సంఖ్యలో కూడా ఇంకా పునః ప్రారంభం కాలేదు.

మల్టీప్లెక్స్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది.తెలంగాణ రాష్ట్రం నుండి థియేటర్ల ఓపెన్‌ కు అనుమతులు వచ్చాయి.

వచ్చే నెల నుండి థియేటర్లను ఓపెన్‌ చేసుకునేందుకు ప్రభుత్వం నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇదే సమయంలో ఏపీలో కూడా డిసెంబర్‌ నుండి పూర్తి స్థాయి థియేటర్లను ఓపెన్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.

అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అన్నట్లుగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి థియేటర్లను ఓపెన్‌ చేయడం వల్ల అన్ని విధాలుగా శ్రేయష్కరంగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సినిమా థియేటర్లు మార్చి ఆరంభంలోనే మూత పడ్డాయి.

Advertisement

అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాలు విడుదల లేకపోవడంతో మూతబడే ఉన్నాయి.గత నెలలో థియేటర్లను ఓపెన్‌ చేసుకోవచ్చు అంటూ అధికారికంగా ప్రకటించినా కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు.

దానికి తోడు ప్రేక్షకులు వస్తారో రారో అనే ఆందోళనతో థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు.ఈ నేపథ్యంలో సినిమా ప్రముఖులు ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇంకా ఎన్నాళ్లు అంటూ థియేటర్లు మూత వేసి ఉంచుతాం.డిసెంబర్‌ నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి థియేటర్లను ఓపెన్‌ చేసి తద్వారా మళ్లీ టాలీవుడ్‌ కు కళ తీసుకు రావాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకు గాను మాస్టర్‌ ప్లాన్‌ ను సిద్దం చేశారు.మోస్తరు బడ్జెట్‌ సినిమాలను విడుదల చేయడం వల్ల థియేటర్లకు జనాలను రప్పించడం మొదలు పెట్టాలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మెల్ల మెల్లగా పెద్ద సినిమాలను విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ నిర్మాతలు భావిస్తున్నారు.అంతా అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి వరకు పూర్తి స్థాయిలో థియేటర్లు రన్‌ అయినా ఆశ్చర్యం అక్కర్లేదు అనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు