ఇప్పుడు ప్రతిఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది.స్మార్ట్ ఫోన్ ( Smart phone )అయినా లేదా నార్మల్ ఫోన్ అయినా సరే తప్పనిసరిగా ఇయర్ ఫోన్ అనేది కావాలి.
సాంగ్స్ వినాలన్నా లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్స్ మాట్లాడుకోవడానికి ఇయర్ ఫోన్స్( Earphones ) ఉపయోగపడతాయి.అయితే ఇటీవల అనేక రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు మార్కెట్ లోకి వచ్చాయి.
వైర్ లెస్ ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, వైర్డ్ ఇయర్ ఫోన్స్ లాంటివి చాలా వచ్చాయి.ఇక బ్లూటూత్ లాంటివి కూడా చాలా ఉన్నాయి.
వీటిని ఉపయోగించడం మరింత సులువు అవుతుంది.

అయితే సింపుల్ గా, సులువుగా అనిపించే ఇయర్ బడ్స్ ను ఎక్కువమంది వాడుతున్నారు.ఇయర్ బడ్స్ పై ఈ కామర్స్ వెబ్ సైట్లల్లో లేదా బయట షాపుల్లో అనేక ఆఫర్లు పెడుతూ ఉంటారు.ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ లాంటి ఆఫర్లు కూడా ఇస్తారు.
తాజాగా టోక్నో కంపెనీ( Tokno Company ) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.ఇయర్స్ బడ్స్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.
ఇందుకోసం గివ్ అవే టు విన్ పేరుత ఒక కాంటెస్ట్ ను నిర్వహిస్తుంది.ఈ కాంటెస్ట్ లో పాల్గొని విజేతగా నిలిస్తే ఉచితంగా ఇయర్ బడ్స్ పొందవచ్చు.

ఇటీవల టెక్నో కంపెనీ టెక్నో క్యామన్ 20 ప్రో 5జీ( Techno Camon 20 Pro 5G ) పేరుతో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది.ఈ స్మార్ట్ ఫోన్ ప్రమోషన్స్ కోసం కంపెనీ సరికొత్త ఆలోచన చేసింది.కాంటెస్ట్ లో పాల్గొని గెలిస్తే ఉచితంగా వైర్ లెస్ ఇయర్ బడ్స్ ని ఇస్తామని వెల్లడించింది.ఈ మేరకు టెక్నో కంపెనీ ఒక ట్వీట్ చేసింది.
టెక్నో క్యామన్ 20 ప్రో 5జీ హ్యాట్ ట్యాగ్ ను ఎక్కువగా కామెంట్ చేయాలి.ఇలా ఎక్కువసార్లు కామెంట్ చేసినవారిని ఎంపిక చేసి వారిలో కొంతమందిలో విజేతలుగా ప్రకటిస్తారు.
వారికి వైర్ లెస్ ఇయర్ బడ్స్ ని ఉచితంగా ఇస్తారు.







