అమెరికాలో కరోనా విజ్రుంభణ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, వ్యాక్సిన్ తీసుకున్న వారు, తీసుకొని వారు అనే తేడా లేకుండా అందరికి కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వ్యాపించింది.ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతోందనుకుంటున్న క్రమంలో మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బిఏ-2 రంగంలోకి దిగింది.
ఇప్పటికే ఈ మహమ్మారి చైనా, హాంకాంగ్, జర్మనీలలో బయటపడగా తాజాగా అమెరికాలో వెలుగు చూడటం అమెరికన్స్ ను భయాందోళనలకు గురిచేస్తోంది.ప్రస్తుతం అమెరికాలో ఈ కొత్త ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అంటున్నారు నిపుణులు.ఇదిలాఉంటే
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారిన పడినట్టుగా తెలుస్తోంది.గడిచిన కొన్ని రోజలుగా ఆయన అనారోగ్యంగా ఉన్నారని, వైద్య పరీక్షలు చేయించగా ఒబామా కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఒబామా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నాయని అయితే కొంత గొంతు నెప్పిగా ఉందని, ఆయన వెల్లడించారు.కాగా ఆయన సతీమణి మిచెల్ ఒబామా కూడా వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమెకు నెగిటివ్ వచ్చిందని తెలుస్తోంది.
గతంలో ఒబామా వ్యాక్సిన్ వేసుకుని ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అయితే వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందని చెప్పిన ఒబామా ఈ క్రమంలోనే అమెరికన్స్ ను హెచ్చరించారు.

వ్యాక్సిన్ ఇప్పటి వరకూ తీసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకోవాలని సూచించారు.భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్స్ వస్తాయో చెప్పలేమని వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రమాదం నుంచీ బయటపడవచ్చునని తెలిపారు.ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాండ్ బిఏ-2 వేగంగా విస్తరిస్తోందని, అమెరికన్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.







