ఇంకా వదలని తెలంగాణా ఉద్యమ సెంటిమెంటు

తెలంగాణా ఉద్యమ సెంటిమెంటును నాయకులు ఇంకా వదలలేదు.

వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలంగాణా ఉద్యమ సెంటిమెంటును ఉపయోగించుకుంటున్నారు.

గులాబీ పార్టీ మాత్రమే తెలంగాణా కోసం పోరాటం చేసిందని, మిగతా పార్టీలు ఉద్యమంలో పాల్గొనలేదని కెసీఆర్, ఇతర నాయకులు నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో ఆ పార్టీల నాయకులు తాము కూడా ఉద్యమంలో పాల్గొన్నామని, రాష్ట్రం కోసం పోరాడామని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణా సెంటిమెంటుతో కాంగ్రెస్ నాయకులను దెబ్బ కొట్టే ప్రయత్నం కెసీఆర్ చేస్తుండగా, ఆయన చెప్పింది అబద్ధమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి 2004 నుంచి 2014 వరకు తెలంగాణా ఉద్యమంలో ఎలాంటి పాత్ర నిర్వహించలేదని కెసీఆర్ ఆరోపించారు.

తెలంగాణా రాష్ట్రం కోసం ఎవరు పోరాడారో ప్రజలకు తెలుసన్నారు.జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు తెలంగాణా కోసం పోరాడలేదని జనం నమ్మితే అది కాంగ్రెసుకు ప్రతికూలంగా మారుతుంది.

Advertisement

దీంతో జైపాల్ కెసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.తెలంగాణా ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి, సీమాంధ్ర మంత్రుల నుంచి తానూ అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నానని జైపాల్ చెప్పారు.

ఉద్యమ సమయంలో ఒకవేళ తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా తెలంగాణా రాకపోయేదని అన్నారు.తాను డైరెక్టుగా ఉద్యమంలో పాల్గొనక పోయినా తెర వెనుక ప్రయత్నాలు చేశానని జైపాల్ చెప్పారు.

గులాబీ పార్టీ తెలంగాణా సెంటిమెంటుతో ఇంకా ఎన్నాళ్ళు నెట్టుకొని వస్తుందో.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు