మార్గదర్శి వ్యవహారాన్ని ఎ.పి ప్రభుత్వం ఈ ఏడాదిలో ముగింపు పలకాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో ఏ చిట్ ఫండ్ కంపెనీ నిబంధనలు పాటించడం లేదనీ అలాంటి వారిని ఏం చేయాలో ఒక కమిటీ వేసి నిర్ణయానికి రావాలని సూచించారు.రామోజీరావు తప్పు చేశారని నిర్ధారణ కాబట్టే అధికారులు ఆయన ఇంటికి వెళ్లారనీ ఉండవల్లి పేర్కొన్నారు.
చిట్స్ కేసుల్లో అరెస్టులు అనవసరం అనీ వ్యాఖ్యానించారు.కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశానికి మంచిదినీ రాహుల్ గాంధీలో ఇప్పుడు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారనీ ఉండవల్లి పేర్కొన్నారు.
ఇటీవల విమాన ప్రయాణంలో రాహుల్ గాంధీతో తీసుకున్న సెల్ఫీ ఫోటోను ఉండవల్లి విడుదల చేశారు.