ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు కొత్త పార్టీ ! ' పొంగులేటి ' డిసైడ్ అయ్యారా ? 

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై గత కొంతకాలంగా సందేశం నెలకొన్న సమితి తెలిసిందే.చాలా కాలంగా బీ ఆర్ ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉండడంతో,  ఆయన పార్టీ మారుతారని ప్రచారం చాలా కాలం నుంచి నడుస్తోంది.

 Former Mp Ponguleti Srinivas Reddy Planning To Form New Political Party Details,-TeluguStop.com

ఈ మేరకు ఆయన చాలా రోజులుగా తను అనుచరులు, ముఖ్య నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్థికంగానూ , సామాజిక పరంగాను బలమైన నాయకుడుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి,  కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయి.

Telugu Khammam, Sharmila, Telangana, Telanganarythu, Ysrtcp-Politics

ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు,  ఆయన సూచించిన వారికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమే అనే సంకేతాలను పంపిస్తున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్,  బిజెపి నేతలతో పాటు,  షర్మిల తోనూ పొంగులేటి మంతనాలు జరిపారు.దీంతో ఆయన ఏ పార్టీలో చేరనున్నారు అనే విషయం గందరగోళంగా మారింది.

ఆయన తాజాగా కొత్త పార్టీ పెట్టాలని ఆలోచనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అది కూడా బీఆర్ఎస్ పేరుతో వచ్చే విధంగా తెలంగాణ రైతు సమితి పేరుతో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Khammam, Sharmila, Telangana, Telanganarythu, Ysrtcp-Politics

బీ ర్ఎస్ పేరుతో పార్టీ పెట్టి, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, తమకు అనుకూలంగా ఉండే అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుని బలమైన పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్నారట.అందుకే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన బీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెడితే రాజకీయంగాను లబ్ధి చేకూరడంతో పాటు, బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది అని పొంగులేటి భావిస్తున్నారట.అయితే కొత్త పార్టీ పెట్టాలా లేక బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉండే మరో బలమైన పార్టీలో చేరాలా అనే విషయంపై ఇంకా పొంగులేటి అనుచరులతో మంతనాలు చేస్తున్నారట.మరికొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ రాబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube