ఎన్టీఆర్ జిల్లా (మైలవరం): 5వ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్న క్యాంటీన్ ను పార్టీ నాయకులతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రతిరోజు వందల మంది ప్రజలు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ తమ ఆకలి తీర్చుకుంటున్నారు.
పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు సహకారంతో ఆన్న క్యాంటీన్ ముందుకు సాగుతుందన్నారు.
మహాత్ముడు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో, పెదొడికి పట్టెడన్నం పెట్టాలని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.