మాజీ మంత్రి శంకర్ నారాయణకు ఘోర అవమానం ఎదురైంది.అది కూడా సొంత పార్టీ నేతల నుంచి ఆయనకు ఎప్పుడూ లేని విధంగా చేధు అనుభవం చూడాల్సి వచ్చింది.
సోమందేపల్లి మండలం రేణకా నగర్ లో ఇవాళ గడప గడపకూ కార్యక్రమానికి ఆయన వెళ్లారు.అయితే ఈదులబలాపురం వైసీపీ రెబల్ సర్పంచ్ అనుచరులు ఆయన్ని గ్రామంలోకి రాకూడదంటూ అడ్డుకున్నారు.
గత కొన్ని రోజులు వైసీపీ నేతలు శంకర్ నారాయణ ఆయన సోదరులపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఈక్రమంలో ఆయన గ్రామానికి వెళ్లడంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు చుట్టు ముట్టారు.
గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.అక్కడే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కానీ శంకర్ నారాయణ కాన్వాయి చెప్పులు విసిరారు.ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.
వారు అరెస్టు చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరించారు. పోలీసుల జీపుకు మహిళలు సైతం అడ్డు వచ్చారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పోలీసులు, శంకర్ నారాయణ వర్గీయులతో రెబల్ వర్గీయులు తీవ్ర వాగ్విదానికి దిగారు.
వారం రోజుల క్రితం ఒక అంగన్వాడీ మహిళను తొలగించారంటూ ఆమె చేసిన హడావుడి అప్పట్లో సంచలనంగా మారింది…
.






