తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు.
కేసీఆర్ సర్కార్ లో రైతులకు భరోసా లేదని ఆరోపించారు.అకాల వర్షాల కారణంగా తడిసిన రైతుల పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.తెలంగాణలో 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్పారు.కానీ ఇప్పటివరకు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారన్నారు.తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కోనాలని ఆమె డిమాండ్ చేశారు.







