వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వైసీపీలో చేరారు.ఈ మేరకు ఆయనకు కండువా కప్పి సీఎం జగన్( CM Jagan ) పార్టీలోకి ఆహ్వానించారు.

 Former Minister Ravela Kishore Babu Joins Ycp Details, Ap Politics, Cm Jagan Inv-TeluguStop.com

వైసీపీలో( YCP ) చేరిన తరువాత మాజీ మంత్రి రావెల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్న ఆయన సీఎం జగన్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు.రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు పోవాలని,

పేద బడుగు, బలహీన వర్గాలకు సాధికారతే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని కొనియాడారు.అంబేద్కర్ ఆశయాలను జగన్ సాకారం చేస్తున్నారని చెప్పారు.ఎక్కడా లేని విధంగా దళారులు లేకుండా, లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు( Govt Welfare Schemes ) నేరుగా ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు.అయితే రావెల కిశోర్ బాబును వైసీపీ అధిష్టానం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube