వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు
TeluguStop.com
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వైసీపీలో చేరారు.
ఈ మేరకు ఆయనకు కండువా కప్పి సీఎం జగన్( CM Jagan ) పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీలో( YCP ) చేరిన తరువాత మాజీ మంత్రి రావెల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్న ఆయన సీఎం జగన్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు.
రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు పోవాలని, """/" /
పేద బడుగు, బలహీన వర్గాలకు సాధికారతే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని కొనియాడారు.
అంబేద్కర్ ఆశయాలను జగన్ సాకారం చేస్తున్నారని చెప్పారు.ఎక్కడా లేని విధంగా దళారులు లేకుండా, లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు( Govt Welfare Schemes ) నేరుగా ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు.
అయితే రావెల కిశోర్ బాబును వైసీపీ అధిష్టానం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!