తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు.మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం కొడాలి నాని సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ తో సమావేశం అయ్యారు.
ఇక ఇదే సమయంలో మంత్రి పదవి నుంచి కొడాలి నానినీ తొలగించిన తర్వాత వైసీపీ హైకమాండ్ ఆయనకు కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇవ్వటం తెలిసిందే.
దీంతో జగన్ తో కొడాలి నాని భేటీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకు.రెండు సంవత్సరాలు టైం ఉన్నాగాని.
తాజా పొలిటికల్ మ్యాప్ చూస్తే ఎన్నికలు దగ్గర పడ్డాయి అన్న వాతావరణం క్రియేట్ అయింది.ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుల విషయంలో మరింతగా దగ్గర అవుతున్నట్లు ప్రకటనలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ కూడా దూకుడుగా పొత్తులపై విమర్శలు చేస్తూ ఉంది.ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ తో కొడాలి నాని భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.







