అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శేషగిరిరావుని పరామర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమ పాయింట్స్.తునలో ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో భాగస్వామికి కేబినెట్ హోదా కల్పించారు.
చంద్రబాబు ఇంటిపై దాడి చేయించిన వారికి కేబినెట్ హోదా ఇచ్చారు.పులివెందుల సంస్కృతి గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చారు.
మీరు లాగులు వేసుకున్నపుడు యనమల మంత్రిగా ఉన్నారు.విలేకరి హత్య కేసును తారుమారు చేయడానికే తెరపైకి ఈ సంఘటన.తక్షణం ఇద్దరు సిఐ లను సస్పెండ్ చేయాలి.ఎస్పీ కి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేసి, దాడి చేసిన వారిని శిక్షించండి.శేషగిరిరావు పై ఘటన జరగకముందే పోలీసులు ఆసుపత్రి కి వచ్చారు.మీకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది అధికార పార్టీ కొమ్ముకాయడానికా.14 ఏళ్ళు సిఎం చేసిన వ్యక్తి పై దాడికి పాల్పడితే 307 కట్టకపోవడం దారుణం.శేషగిరిరావు లాంటి నాయకుడు భయపడకుండా వ్యవహరించిన తీరుపై గర్వపడుతున్నాం.ప్రశాంతమయిన గోదావరి జిల్లాను ముఖ్యమంత్రి నాశనం చేశాడు.మీ పదవులు శాశ్వతం కాదు మేము అధికారంలో ఉన్నపుడు ఎప్పుడు హత్యలను ప్రోత్సహించలేదు.ఈ హత్య రాజకీయలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.