ఒకప్పుడు ట్రెడిషనల్ గా కనిపించిన అమ్మాయిలంతా ఈమధ్య గ్లామర్ షో చేస్తూ బాగా రెచ్చిపోతున్నారు.ఒకరిని చూసి మరొకరు గ్లామర్ షో చేయటానికి తగ్గట్లేదు.
ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెరకు చెందిన కొందరు ఆర్టిస్టులు మాత్రం ఈమధ్య తెగ అందాలను ఆరబోస్తున్నారు.మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆర్టిస్టులు ఇప్పుడు తమ అందాల ఆరబోతతో అందరికీ షాక్ ఇస్తున్నారు.
తాజాగా ఓ యాంకర్ కూడా హాట్ ఫోటో షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది.ఇంతకూ ఆమె ఎవరంటే యాంకర్ స్రవంతి.
యాంకర్ గా పరిచయమైన స్రవంతి అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులతో పరిచయం పెంచుకుంది.ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్రవంతి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.మొదట్లో యూట్యూబ్ లో యాంకర్ గా చేసిన స్రవంతి ఆ తర్వాత మాటీవీ, జెమినీ వంటి పలు ఛానల్స్ లో చేసి మరింత పరిచయం పెంచుకుంది.
ఇక జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టింది.అందులో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి తొలిసారి పర్ఫామెన్స్ తోనే బాగా ఆకట్టుకుంది.పైగా బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.అందులో తానే ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఈమె ఏదైనా సందర్భాలలో పంచుకునే పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి.

ఎందుకంటే ఆమె అందులో ట్రెడిషనల్ లుక్ తో పాటు.తాళిబొట్టును, నుదుట బొట్టు ను పెట్టుకుంటూ కనిపిస్తుంది.ఈమె ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి.కానీ ఈమధ్య గ్లామర్ షో కూడా బాగా చేస్తూ రచ్చ చేస్తుంది.దీంతో ఆమెకు బాగా నెగిటివ్ కామెంట్లు ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.

ఈ మధ్య అషు రెడ్డితో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది.అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఇక ఈమె అషుతో బాగా క్లోజ్ అవ్వడంతో తన లాగే తయారవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తను మరోసారి అందాలు ఆరబోసింది స్రవంతి.తన ఇన్ స్టా లో ఒక హాట్ ఫోటో షేర్ చేసింది.
ఆ ఫోటో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం.అషు రెడ్డి ని ట్యాగ్ చేసి అషూ నీ ట్రైనింగ్ ఏనా.ఒకరిని మించి ఒకరు ఉన్నారుగా.కెసిపిడి, ఎన్ ఎన్ ఎన్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు మీరంతా అంటూ ట్రోల్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.







