క్యాసినో, గ్రానైట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.క్యాసినో కేసులో భాగంగా ఇవాళ మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణను అధికారులు విచారించారు.అయితే విచారణ మధ్యలో ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.అదేవిధంగా ఈ కేసులో ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను అధికారులు ప్రశ్నించారు.మరోవైపు గ్రానైట్ కేసు విచారణలో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారులను ఈడీ అధికారులు విచారించనున్నారు.విదేశాలకు గ్రానైట్ ఎగుమతుల్లో అవకతవకలపై ఆరా తీయనున్నారు.
ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.అదేవిధంగా హవాలా నగదు చెల్లింపులపై విచారిస్తుంది.







