Waltair Veerayya Veerasimha Reddy : సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు.. మరి డేట్స్ క్లారిటీ ఎప్పుడు?

ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని ప్రత్యేక పండుగలకు సినిమాలను రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ ఉంటుంది.అదే విధంగా మన టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.

 The Biggest Clash Of Tollywood For This Sankranti 2023,varasudu, Sankranthi, Wal-TeluguStop.com

ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికే ఆదిపురుష్ ఈ పోటీ నుండి తప్పుకుంది.అయినా కూడా నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

అందులో రెండు తెలుగు సినిమాలు కాగా.రెండు తమిళ్ సినిమాలు.

ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ బాగానే ఉండబోతుంది.మరి ఈసారి రేస్ లో ఎవరు ఉన్నారంటే.

ఈసారి సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు.ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమా ‘వరిసు’ కూడా రిలీజ్ కాబోతుంది.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.

Telugu Ajith Kumar, Sankranthi, Sankranti, Biggestclash, Thunivu, Tollywood, Var

వాల్తేరు వీరయ్య సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలను సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.ఈ మూడు సినిమాలతో పాటు మరో తమిళ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

విజయ్ వరిసు సినిమాకు పోటీగా అజిత్ కుమార్ ‘తునివు‘ కూడా రిలీజ్ కాబోతుంది.హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బోణీ కపూర్ నిర్మిస్తున్నారు.అయితే ఈ నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయని చెప్పారు కానీ ఇంకా రిలీజ్ డేట్స్ మాత్రం ప్రకటించలేదు.మరి రిలీజ్ డేట్స్ పై కూడా ఒక క్లారిటీ అనేది ఇస్తే ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube