గుంటూరు: మాజీ హోంమంత్రి సుచరిత కామెంట్స్: సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా వినపడుతున్నాయి.ఆ వార్తలను బేస్ చేసుకుని శాటిలైట్ ఛానల్స్ లో పార్టీ మారతానన్న వార్తలు వస్తున్నాయి.2019లో నన్ను అభ్యర్థి గా నిలబెట్టిన నాయకుడు జగన్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తొలి మహిళ హోం మంత్రి గా నాకు అవకాశం ఇచ్చారు.
పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు.పార్టీ మారటం అంటే నేను ఇంటికే పరిమితమౌతాను.
గడప గడపకు వెళితే ప్రతి ఇంటి కి లబ్ది చేకూరింది.ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నారు.
దళితుల్లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను.అర్హత ఉన్న అందరికీ అన్ని పథకాలు అందిస్తున్న పార్టీ వైసీపీ.
గత ప్రభుత్వం సరిగా పరిపాలన చేస్తే 23 సీట్లకే పరిమిత మయ్యేవారా.

విద్యా వ్యవస్త లో పెను మార్పులు తీసుకువచ్చి అందరికీ విద్య అందించేది జగన్మోహనరెడ్డి ప్రభుత్వం.వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దత్తు ఉంది.నాపై చిలవలు పలవలు రాయొద్దు.
ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి.నేను రాజకీయాలలో ఉన్నంతకాలం వైసీపీ లోనే ఉంటాను.
పార్టీ మారి రాజకీయాలు చేయను.నన్ను రెండున్నర సంవత్సరాలు హోంమంత్రి గా కొనసాగాలని ముఖ్యమంత్రి చెప్పారు.
నా ఇంట్లో సొంత మనిషి వని జగన్ చెప్పారు.ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది.దానికే ఫోన్ ట్యాపీంగ్ చేయాల్సిన అవసరం లేదు.దయాసాగర్ ప్రస్తుతం పోటీలో లేరు.జగన్ ఆశీర్వదించి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడినుంచి పోటీ చేస్తా.