42 రోజుల పాటు ఒకే దుస్తులు.. ఆ దర్శకుడి ప్రవర్తనపై విద్యాబాలన్ సెటైర్లు మామూలుగా లేవుగా!

బాలీవుడ్ నటి విద్యాబాలన్‌, ప్రతిక్‌ గాంధీ, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దో ఔర్‌ దో ప్యార్‌( Do Aur Do Pyaar ) రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంది.తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్‌ ని సొంతం చేసుకుంది.

 Former Director Wore The Same Pair Of Shorts On Set For 42 Days Says Vidya Balan-TeluguStop.com

ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా గత కొన్నిరోజుల నుంచి విద్యాబాలన్‌ వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక దర్శకుడిని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Days, Bollywood, Aur Pyaar, Pair, Vidya Balan-Movie

అతడికి మూఢ నమ్మకాలు ఎక్కువ అని తెలిపారు.తన చిత్రానికి మంచి ఆదరణ రావాలనే ఉద్దేశంతో అతడు వింతగా ప్రవర్తించాడు అని ఆమె అన్నారు.ఈ సందర్బంగా విద్యా బాలన్( Vidya Balan ) మాట్లాడుతూ.నేను హీరోయిన్ గా నటించిన ఒక సినిమా సెట్‌లో చోటుచేసుకున్న సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోను.

చిత్ర దర్శకుడికి కాస్త మూఢవిశ్వాసాలు ఎక్కువ.తన చిత్రం విజయం అందుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 42 రోజుల పాటు ఒకే షార్ట్ ధరించాడు.

దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు.వేరే వాళ్ల ద్వారా విషయం తెలిసి షాకయ్యాను.

తీరా చూస్తే ఆ సినిమా ఘోర పరాజయం అందుకుంది.ఆ దర్శకుడెవరు? సినిమా ఏమిటి? అనేది ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు అని తెలిపింది విద్యా బాలన్.

Telugu Days, Bollywood, Aur Pyaar, Pair, Vidya Balan-Movie

ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి వ్యక్తులను ఎంతోమందిని చూశాన ని ఆమె అన్నారు.ఒక నిర్మాత కూడా ఇలాగే ప్రవర్తించారన్నారు ఆ నిర్మాత నన్ను బాధపెట్టేలా మాట్లాడారు.షూట్‌ మొదలైన కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తొలగించినట్లు వార్తలు వచ్చాయి.నా జాతకం తన వద్ద ఉందని, నేనొక దురదృష్టవంతురాలినని అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నానని ఆయన మీడియాతో చెప్పారు అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube